నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి

Jun 8 2025 12:38 AM | Updated on Jun 8 2025 12:38 AM

నిరుద

నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేస్తారని ఎదురు చూస్తున్నాం. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వాలి.

– జె. ఉమామహేష్‌, మరియాపురం, కడప

ఉచిత బస్సు ప్రయాణం హుళక్కేనా?

18–49 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా దాని గురించి పట్టించుకోవడం లేదు. అసలు ఇస్తారో, ఇవ్వరో కూడా తెలియడం లేదు. గత ప్రభుత్వంలో ఏ పథకం ఎప్పుడు ఇచ్చేది తేది ప్రకటించి మరీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా చెప్పారు. అదీ చేయలేదు. – పత్తి రాజేశ్వరి, వైఎస్సార్‌సీపీ

మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, కడప

ఆడబిడ్డ నిధి ఎప్పుడిస్తారు

ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెలా ఆడ బిడ్డ నిధి పేరుతో రూ.1500 లు ఇస్తామని చెప్పాడు. ఇప్పుడేమో అధికారంలోకి వచ్చిన ఏడాది అయినా దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి నెలా రూ.1500 ఇస్తే కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో ఏడాది క్రమం తప్పకుండా రూ.45 వేలు వచ్చేది. ఇప్పుడేమో రూ.1500 లేదు, అప్పుడిచ్చే రూ.18 వేలు లేకుండా పోయింది. –కానాల విజయ, గృహిణి,

ఎకోపల్లె గ్రామం, దువ్వూరు మండలం

నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి 
1
1/2

నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి

నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి 
2
2/2

నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement