
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
సూర్యాపేట: ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని శ్రీసంతోషిమాత దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్యవైశ్యులు ఎక్కువ స్థానాల్లో నిలబడి గెలిచి ప్రజలకు మరింత సేవలందించాలని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. పేద ఆర్యవైశ్యులకు, ఆర్యవైశ్య విద్యార్థులకు సహాయం అందించాలన్నారు. ఈ సందర్భంగా సంతోషిమాత దేవస్థాన కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత దేవస్థాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బ్రాహ్మణపల్లి మురళీధర్, నూక వెంకటేశం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండారు రాజా, ఉపాధ్యక్షుడు గోపారపు రాజు, కోశాధికారి చెల్లా లక్ష్మీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఊరే లక్ష్మణ్, పప్పా ప్రకాష్, భువనగిరి విజయ్‌కుమార్, కొత్త మల్లికార్జున్, రాచర్ల కమలాకర్, వెంకటేశ్వర్లు, గుడిపాటి రమేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఫ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ