
కాలువలోకి దూసుకెళ్లిన కారు
కాళ్ల: అతివేగంతో వెళ్తున్న కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జువ్వలపాలెం వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి సచివాలయం ఎదుట విద్యుత్ స్తంభాన్ని కొట్టి కాలువలోకి వెళ్లింది. కారువేగం ధాటికి విద్యుత్ స్తంభం ముక్కలైంది. విద్యుత్ తీగలు ఆధారంతో స్తంభం నిలిచిందని, ప్రమాద సమయంలో కారులో చిన్నపిల్లలు కూడా ఉన్నారని స్థానికులు తెలిపారు. కారుకి బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణనష్టం జరగలేదు. చిన్న చిన్న దెబ్బలతో బయటపడిన వారిని స్థానికులు భీమవరం హాస్పిటల్కి తరలించారు.