పొట్టేల్‌.. అధరహో.. | - | Sakshi
Sakshi News home page

పొట్టేల్‌.. అధరహో..

Jun 5 2025 2:09 AM | Updated on Jun 5 2025 2:09 AM

పొట్ట

పొట్టేల్‌.. అధరహో..

గురువారం శ్రీ 5 శ్రీ జూన్‌ శ్రీ 2025

12లోu

కాజీపేట : బక్రీద్‌ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్‌ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్‌ ఉంటుంది. ట్రైసిటీతో పాటు నగరంలోని 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్‌ వేడుకను ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా ఉన్నవారు రెండు, మూడు పొట్టేళ్లను బలిఇస్తారు. వారు కొంత మటన్‌ను వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్చానీ (దానం) ఇస్తారు.

పొట్టేళ్లను విక్రయించేందుకు గ్రామాలనుంచి కాపరులు నగరానికి వస్తుంటారు. అయితే ఏజెంట్లు కలగజేసుకొని తమకు పరిచయం ఉన్నవారికి అమ్మిస్తాం.. మాకు కమీషన్‌ ఇవ్వాలని నమ్మించి పొట్టేళ్లు తెచ్చిన కాపరులను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఏజెంట్లే రేట్లు నిర్ణయించి తెలిసిన వారికి విక్రయించి లాభాలు గడిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఏజెంట్ల వల్ల ధరలు పెరగడమేనని పలువురు వాపోతున్నారు. బక్రీద్‌ సందర్భంగా పొట్టేళ్ల ధరలను చూసి పలువురు ఇంత రేటా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బక్రీద్‌ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నా యి. పొట్టేల్‌ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్‌ రోజు వరంగల్‌ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్లు బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు.

ధర రూ.5వేల నుంచి మొదలు

పొట్టేల్‌.. అధరహో..1
1/1

పొట్టేల్‌.. అధరహో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement