పునరావాస పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పునరావాస పనుల్లో వేగం పెంచాలి

Jun 10 2025 3:34 AM | Updated on Jun 10 2025 3:34 AM

పునరావాస పనుల్లో వేగం పెంచాలి

పునరావాస పనుల్లో వేగం పెంచాలి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్‌ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్‌తండా, అంజనగిరి తండా, వడ్డె గుడిసెలు తదితర గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్‌, ఎల్లూర్‌ గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement