హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చారు.. | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చారు..

Jun 10 2025 3:32 AM | Updated on Jun 10 2025 3:34 AM

ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చా. పనులు దొరక్కపోవడంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉండేవాడిని. ఓ వ్యక్తి పరిచయమై చేపల కంపెనీలో పనిచేసేందుకు పిలిచాడు. అడ్రస్‌ చెప్పలేదు. అతడి వెంట వచ్చా. మల్లేశ్వరంలో ఓ వ్యక్తికి అప్పగించాడు. 5 నెలలుగా కృష్ణానదిలో చేపల వలలు లాగే పనులు చేశా. రోజు అన్నంతోపాటు కారంపొడి పెట్టేవారు. లేదంటే చేపలు వండుకొని తినాలి. రాత్రి, పగలు పనిచేయాలి. పని చేయలేమంటే కొట్టేవారు. మూత్రానికి వెళ్లినా ఒకరిద్దరు మాకు కాపలా ఉంటారు. పనిచేసినందుకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. అధికారులు జీతాలు ఇప్పించకుండానే మా ఊళ్లకు పంపించారు.

– రాహుల్‌, బెంగుళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement