నామినేషన్లు, ర్యాలీల జోరు | Sakshi
Sakshi News home page

నామినేషన్లు, ర్యాలీల జోరు

Published Fri, Nov 10 2023 4:44 AM

జిల్లాకేంద్రంలో నామినేషన్‌ దాఖలుకు ఎద్దులబండిపై వెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి - Sakshi

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డిలో చేరిన షాద్‌నగర్‌ మినహా మిగిలిన 13 నియోజకవర్గ స్థానాలకు సంబంధించి గురువారం ఒక్కరోజే 87 నామినేషన్లు దాఖలయ్యాయి.

ర్యాలీల జోరు..

నినాదాల హోరు

● మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి నామినేషన్‌ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీ జనసంద్రంగా మారింది. న్యూటౌన్‌ నుంచి బస్టాండ్‌ మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. మంత్రి తన కూతురు, కుటుంబసభ్యులతో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

● దేవరకద్రలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన తల్లి వరలక్ష్మి, భార్య మంజుల, కూతుళ్లు, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా నామినేషన్‌ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌ రోడ్డులోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌పత్రాలు సమర్పించారు.

● జడ్చర్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రేమ్‌ రంగా గార్డెన్‌ నుంచి వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

● కొల్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్‌రావు పార్టీ కార్యాలయం నుంచి.. కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు జగ్జీవన్‌రాం చౌరస్తా నుంచి వేర్వేరుగా ర్యాలీ నిర్వహిస్తూ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వరకు చేరుకున్నారు.

● అలంపూర్‌లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్‌ అలంపూర్‌ మున్సిపాలిటీలోని న్యూప్లాట్స్‌ కాలనీ నుంచి ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

● వనపర్తిలో నామినేషన్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి నిరంజన్‌రెడ్డి అంబేద్కర్‌ చౌరస్తా నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజీవ్‌చౌక్‌లో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

● అచ్చంపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి చిక్కుడ వంశీకృష్ణ వేలాది మంది అనుచరులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ దాఖలు చేశారు.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ నామినేషన్ల పర్వం ఊపందుకుంది. గురువారం ఏకాదశి మంచి రోజు కావడం, ముందస్తుగా నిర్ణయించుకున్న మేరకు ఆయా పార్టీలతో పాటు రెబల్స్‌, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ సెంటర్లకు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గ కేంద్రాలు ర్యాలీలు, నినాదాలతో హోరెత్తాయి. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ నామినేషన్ల తంతు పూర్తి చేశారు. బీజేపీకి సంబంధించి అలంపూర్‌, దేవరకద్ర అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. కానీ ఆ పార్టీకి చెందిన పలువురు ఆయా సెగ్మెంట్ల నుంచి నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరికి టికెట్‌ ఇస్తారు లేక మరెవరికై నా ఖరారు చేస్తారా అనే అంశం ఆ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.

గురువారం ఎక్కడెక్కడ, ఎలా అంటే..

మహబూబ్‌నగర్‌ జిల్లా

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మున్నూరు రవి (బీఆర్‌ఎస్‌ రెబల్‌), ఎంఏ ఖాదర్‌ (ప్రగతిశీల సమాజ్‌ పార్టీ), టి.కృష్ణ (భారత చైతన్య యువజన పార్టీ), కె.రాములు (ధర్మసమాజ్‌ పార్టీ), స్వతంత్ర అభ్యర్థులుగా అశోక్‌ కుమార్‌ గజ్‌బింకర్‌, కారకొండ శ్రీనివాసులు, మహమ్మద్‌ షరీఫ్‌ నామినేషన్లు దాఖలు చేశారు. దేవరకద్రలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కతలయ్య(విద్యార్థుల రాజకీయ అనుబంధ పార్టీ), ఎల్లప్ప (ప్రజాఏక్తా పార్టీ), బండ మధుసూదన్‌రెడ్డి (జన శంఖారావం) నామినేషన్లు వేశారు. జడ్చర్ల సెగ్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, స్వతంత్రులుగా కోస్గి వెంకటయ్య, మోహన్‌, శ్రీకాంత్‌ (బీసీవై) నామినేషన్లు దాఖలు చేశారు.

జోగుళాంబ గద్వాల జిల్లా

గద్వాలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తరఫున ఆయన భార్య జ్యోతి, బోయ శివారెడ్డి (బీజేపీ), అతికూర్‌ రహమాన్‌ (బీఎస్పీ), గొంగళ్ల రంజిత్‌ కుమార్‌ (ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), కృష్ణ (భారతీయ స్వదేశీ కాంగ్రెస్‌), స్వతంత్ర అభ్యర్థులుగా వెంకటేష్‌ నాయక్‌, ఉప్పరి కృష్ణ ఒక సెట్‌ వేశారు. అలంపూర్‌ సెగ్మెంట్‌లో విజయుడు (బీఆర్‌ఎస్‌), బంగి లక్ష్మణ్ణ (బీజేపీ), మల్లయ్య(బీజేపీ), మేరమ్మ (బీజేపీ), లింగన్న (ఏఐఎఫ్‌బీ), కేశవులు (బీఎస్పీ), ఆర్‌ఎస్‌ ప్రసన్న కుమార్‌ (బీఎస్పీ), స్వతంత్రులుగా మాదన్న, ప్రేమలత, బీసన్న నామినేషన్‌ దాఖలు చేశారు.

నారాయణపేట 3

మహబూబ్‌నగర్‌ 8

దేవరకద్ర 4

మక్తల్‌

4

వనపర్తి

9

నాగర్‌కర్నూల్‌ 7

అచ్చంపేట 10

కొల్లాపూర్‌ 8

కల్వకుర్తి 8

కొడంగల్‌ 4

నారాయణపేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి, ధర్మ సమాజ్‌ నుంచి ఈశ్వర్‌, స్వతంత్ర అభ్యర్థిగా సత్యనారాయణ బండ నామినేషన్లు దాఖలు చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 9 బీఆర్‌ఎస్‌, శ్రీహరి(కాంగ్రెస్‌)తరుఫున మాన్వే రామారావు, వర్కటం జగన్నాథం (బీఎస్పీ), వెంకట్‌రామ్‌రెడ్డి (ఫార్వర్డ్‌ బ్లాక్‌)నుంచి నామినేషన్‌లు దాఖలు చేశారు.

తుది దశకు చేరిన పర్వం

నియోజకవర్గాల వారీగా గురువారం దాఖలైన నామినేషన్ల వివరాలు..

వనపర్తి జిల్లా

వనపర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా ముగ్గురు, ప్రజా ఏక్తా పార్టీ, అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌, బీఎస్పీ, డీఎస్పీ, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.

నారాయణపేట జిల్లా

నాగర్‌కర్నూల్‌ జిల్లా

నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ నుంచి కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, కొత్తపల్లి కుమార్‌ (బీఎస్పీ), స్వతంత్రులుగా వడ్డే శివకృష్ణ, ముకేశ్‌, మిద్దె రాములు, కె.జానకిరాములు (అలియన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌) గడ్డం విజయ్‌ కుమార్‌ (బహుజన్‌ ముక్తి) నామినేషన్లు వేశారు. కొల్లాపూర్‌లో ఎల్లేని సుధాకర్‌రావు (బీజేపీ), జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్‌), సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి భార్య విజయ, కాటగౌని తిరుపతమ్మ (బీసీవై), బింగి సాయన్న (బహుజన శక్తి), గొంతి విక్రమ్‌ (సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి), నేనావత్‌ శివుడు (నవరంగ్‌ కాంగ్రెస్‌), కరనే శిరీష (స్వతంత్ర) నామినేషన్లు దాఖలు చేశారు. కల్వకుర్తిలో తల్లోజు ఆచారి (బీజేపీ), శ్రీనివాసులు (బీఎస్పీ), రమేష్‌ (ధర్మ సమాజ్‌), జంగయ్య (ప్రజాశాంతి), బురియాలు (ఘన సురక్ష పార్టీ), స్వతంత్రులుగా యాదమ్మ, పాండురంగయ్య, ఆంజనేయులు నామినేషన్లు వేశారు. అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తరఫున ఆయన సతీమణి అమల, కాంగ్రెస్‌ అభ్యర్థి, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ, ఆయన సతీమణి అనురాధతో పాటు సతీష్‌ (బీజేపీ), కొండపల్లి రాములు (బహుజన్‌ ముక్తి), చింతసాయిబాబు (ధర్మసమాజ్‌), స్వతంత్ర అభ్యర్థులుగా వెంకటేష్‌, రవి, జి.రాజు, చారగొండ కృష్ణమ్మ నామినేషన్లు వేశారు.

ఏకాదశి వేళ సెంటర్లకు పోటెత్తిన అభ్యర్థులు

ఒక్క రోజులోనే 87 నామినేషన్లు దాఖలు

భారీ ర్యాలీలతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల సందడి

అలంపూర్‌ అభ్యర్థిని ప్రకటించని బీజేపీ

అయినా పార్టీ నుంచి నామినేషన్లు వేసిన పలువురు

నేటితో ముగియనున్న గడువు

జడ్చర్ల

4

గద్వాల

8

అలంపూర్‌

10

Advertisement
Advertisement