పాలిసెట్‌ ఫలితాల్లో నంబర్‌ 1 | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ ఫలితాల్లో నంబర్‌ 1

Published Thu, May 9 2024 5:30 AM

పాలిస

● మెరిసిన విశాఖ విద్యార్థులు ● రాష్ట్ర స్థాయిలో ఇద్దరికి ఒకటో ర్యాంకు ● టాప్‌టెన్‌ ర్యాంకుల్లో ముగ్గురికి చోటు ● 12,147 మందిలో 10,813 మంది ఉత్తీర్ణత

విశాఖ విద్య/తగరపువలస: పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష(పాలిసెట్‌–2024)లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాకు చెందిన ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడంతో పాటు ర్యాంకుల సాధనలోనూ టాప్‌లో నిలిచారు. సాంకేతిక విద్యాశాఖ అధికారులు బుధవారం పాలిసెట్‌ ఫలితాలు ప్రకటించారు. జిల్లా నుంచి 12,147 మంది ప్రవేశ పరీక్షకు హాజరు కాగా.. వీరిలో 10,813 మంది అర్హత సాధించారు. తద్వారా జిల్లాలో 89.02 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బాలబాలికల వారీగా చూసిన ట్లయితే 7,265 మంది బాలురు పరీక్ష రాయగా, 6,379 మంది (87.80 శాతం) అర్హత సాధించారు. 4,882 మంది బాలికలు పరీక్ష రాయగా, వీరిలో 4434 మంది (90.82 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పాస్‌ పర్సంటేజీలో రాష్ట్ర సగటు 87.61 శాతం కాగా.. విశాఖ జిల్లాలో అంతకుమించి (89.02 శాతం)ఉత్తీర్ణత నమోదు చేసుకోవడం విశేషం. ఈ ఏడాది రాష్ట్రంలో జిల్లా నుంచే ఎక్కువ మంది పాలిసెట్‌కు హాజరుకాగా.. అదే స్థాయిలో అర్హత సాధించడం విశేషం. సిరినివాస్‌ అన్నమరాజు నగర్‌(కొమ్మాది)కు చెందిన పోతుల జ్ఞాన హర్షిత, సంగివలస శశి స్కూల్‌ విద్యార్థి శీలం శ్రీరామ్‌ భవదీప్‌ రాష్ట్రస్థాయి ఒకటో ర్యాంకును కై వసం చేసుకున్నారు. శీలం ఐశ్వర్య రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు దక్కించుకుంది.

జిల్లాలో 6,730 సీట్లు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్యాల పరిధిలోని 15 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 6,730 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా మెకానికల్‌ 1,716 సీట్లు, ఆ తర్వాత సీఎంఈ 1,419, ఈఈఈ 1,321, ఈసీఈ బ్రాంచిలో 990 సీట్లు ఉన్నాయి. జిల్లా విద్యార్థులకు టాప్‌ కాలేజీల్లోనే సీట్లు లభిస్తాయని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌, జిల్లా నోడల్‌ అధికారి డాక్టర్‌ కె.నారాయణరావు వెల్లడించారు.

ప్రసిద్ధ ఐఐటీలో చదువుతా..

పాలిసెట్‌లో 120 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్నాను. దేశంలోనే పేరు పొందిన ఐఐటీలో చదవాలనుకుంటున్నాను. మా నాన్న అప్పలనాయుడు బోయిపాలెం జెడ్పీ హైస్కూల్‌లో సోషల్‌ అసిస్టెంట్‌గా, అమ్మ ప్రగతి చోడవరం నీటి పారుదల శాఖలో డివిజనల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సబ్జెక్ట్‌పై అవగాహన కారణంగా ప్రత్యేకంగా ప్రిపేర్‌ కాలేదు.

– పోతుల జ్ఞానహర్షిత, కొమ్మాది

పాలిసెట్‌ ఫలితాల్లో నంబర్‌ 1
1/1

పాలిసెట్‌ ఫలితాల్లో నంబర్‌ 1

Advertisement
 
Advertisement