● పెన్షన్‌ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు | Sakshi
Sakshi News home page

● పెన్షన్‌ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు

Published Sat, May 4 2024 4:40 AM

● పెన

ఈ తిప్పలు మాకొద్దు బాబూ!

నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఎలాగోల చిన్నగా కాళ్లీడ్చుకుంటూ రెండు రోజుల నుంచి బ్యాంక్‌ చుట్టూ తిరుగుతున్నాను. అయినా పింఛన్‌ రాలేదు. చివరిగా నా అకౌంటు సరిగాలేదని, అందుకు సంబంధిత ఆధారాలు తెచ్చి కొత్తగా అకౌంటు చేసుకోవాలని చెబుతున్నారు. మాకు ఇన్ని కష్టాలు తెచ్చిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది.

– ఇన్నమాల కోటయ్య, గొల్లపాళెం

చంద్రబాబు వల్లే ఈ బాధలు

నాకు పట్టణలోని స్టేట్‌ బ్యాంకులో ఖాతా ఉంది. మా ఊరు నుంచి పది కిలోమీటర్ల దూరంలోని శ్రీకాళహస్తికి ఆటోలో వచ్చి వెంకటగిరి బస్టాండులో దిగాను. అక్కడి నుంచి మరో రూ.20 ఇచ్చి బ్యాంకు వద్దకు చేరుకున్నా. ఆటోలో వస్తుంటే ఎండకు దేవుళ్లు కనిపించారు. వలంటీర్లు ఇంటికి వచ్చి పింఛన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు ఎందుకు ఈ బాధలు?. గతంలో చంద్రబాబు పాలనలో గుడి వద్ద, బడుల వద్ద నిలబడుకుని పింఛన్‌ తీసుకునేవాళ్లం. ఇప్పుడు ఆయన వల్లే సచివాలయాలు, బ్యాంక్‌ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పింఛన్‌ ఇంటికి వచ్చి ఇచ్చే ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నా.

– చెంగమ్మ, కొణతనేరి, తొట్టంబేడు

● పెన్షన్‌ డబ్బుల  కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట
1/1

● పెన్షన్‌ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట

Advertisement
 
Advertisement