శ్రీవారికి చక్రస్నానం | Sakshi
Sakshi News home page

శ్రీవారికి చక్రస్నానం

Published Wed, May 22 2024 6:05 AM

శ్రీవ

మురళీనగర్‌: కప్పరాడ ఎన్‌జీజీవోస్‌ కాలనీలో వెలసిన వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. తెల్లవారుజామునుంచి వైభవుడికి ఉదయాస్తమాన సేవలు చేశారు. ఉదయం 5గంటలకు వైభవుడికి సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన, బాలభోగం, మంగళాశాసనం, పుణ్యాహవాచనం, రుత్విక్‌గ్వరుణ, రక్షాసూత్రబంధన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, పతాక ప్రతిష్ఠ, విశేష హోమాలు, మహానివేదన, మంగళశాసనం నిర్వహించారు. శ్రీవారి ఉత్సవ విగ్రహంతో తిరువీధి మహోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామికి చక్రస్నానం చేశారు. ఈ పవిత్ర జలాలలను భక్తులు స్వీకరించి తరించారు. బుధవారం ఉదయం 6గంటలకు వైభవుడవికి పౌర్ణమి పంచామృతాభిషేకం అనంతరం సర్వాంగ వజ్రకవచంతో శ్రీవారి దర్శనం ఉంటుందని ఆలయ కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్‌ చెప్పారు.

శ్రీవారికి చక్రస్నానం
1/2

శ్రీవారికి చక్రస్నానం

శ్రీవారికి చక్రస్నానం
2/2

శ్రీవారికి చక్రస్నానం

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement