
అమెజాన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రైమ్ డే ఈ నెల 20న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెజాన్‌లో బ్యూటీ అండ్ లగ్జరీ కేటగిరీల సారధిగా ఎంపికైన సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ షాలిని మట్టాతో భేటీ అవకాశాన్ని అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జంషెడ్‌పూర్‌కు చెందిన షాలిని విశాఖపట్నంలో పెరిగి..ఐఐటీ ఢిల్లీలో ఇంజనీరింగ్ డిగ్రీని, ఐఐఎం కోల్‌కత్తాలో ఎంబీఏ పూర్తి చేసుకున్నారనీ, ఆపై కంటెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్ రంగంలోకి ప్రవేశించారన్నారు. విధుల్లో భాగంగా లైవ్ వీడియో షాపింగ్‌ను పర్యవేక్షిస్తారని, క్రియేటర్ కమ్యూనిటీలను నిరి్మంచడం, బ్యూటీ సోషల్ మీడియా, ఇన్‌ఫ్లుయెన్సర్ కంటెంట్ క్రియేషన్ వర్క్‌స్ట్రీమ్‌లను నిర్వహిస్తారన్నారు.