నేడు మంత్రులతో సీఎం భేటీ | CM Revanth Reddy meeting with ministers on November 30 over Global Summit | Sakshi
Sakshi News home page

నేడు మంత్రులతో సీఎం భేటీ

Nov 30 2025 5:44 AM | Updated on Nov 30 2025 5:44 AM

CM Revanth Reddy meeting with ministers on November 30 over Global Summit

గ్లోబల్‌ సమ్మిట్‌ పని విభజనపై చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం తన మంత్రివర్గ సహచరులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భేటీలో వచ్చే నెల 8–9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ గురించి చర్చించనున్నారు. ఈ సమావేశాల నిర్వహణ గురించి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) రూపొందించిన ప్రజెంటేషన్‌ను పరిశీలించిన అనంతరం ఈ సమావేశంలోనే ఆయన మంత్రులకు పని విభజన చేయనున్నారు.

దీని గురించి ఆదివారం సాయంత్రం సీఎం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. శనివారం కూడా సీఎం రేవంత్‌ను పలువురు మంత్రులు కలిశారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సీఎంను కలిసి పలు అభివృద్ధి పనులపై చర్చించారని, ప్రజా పాలన వారోత్సవాల నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement