
డీఎంకే నూతన సభ్యత్వం ప్రారంభం
పళ్ళిపట్టు: పళ్లిపట్టు నార్త్ మండల కార్యదర్శి సీజే.శ్రీనివాసన్ ఆధ్వర్యంలో పుణ్యం గ్రామంలో గురువారం డీఎంకే నూతన సభ్వత్వ నమోదు శిబిరం ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి ప్రజలను కలిసి, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలుపై అవగాహన కల్పించి, కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకే వర్గంలో ఉండాల్సిన అవసరంపై వివరించారు. అలాగే రాష్ట్రంతోపాటు తమిళులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం చూపుతున్న సవతితల్లి ప్రేమ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, డీఎంకే పార్టీలో సభ్యులుగా చేరాలని సూచించారు. దీంతో యువత, అధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వం స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. నూతన సభ్యత్వం నమోదు శిబిరాల్లో డీఎంకే క్యాడర్ ఉత్సాహంగా పాల్గొని, గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించి, పార్టీ సభ్యత్వం నమోదు చేశారు.