
చైన్నెలో భారత్ బెంజ్ హెచ్‌ఎక్స్ శ్రేణి వాహనం ఆవిష్కర
సాక్షి,చైన్నె: చైన్నెలోని ఒరగడంలో డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ కొత్త భారత్ బెంజ్ హెచ్‌ఎక్స్ శ్రేణి వాహనాన్ని బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ హెవీ –డ్యూటీ ట్రక్ సిరీస్‌ను డైమల్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సత్యకమ్ ఆర్య, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తిమ్మయాన్‌లు విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశపు నిర్మాణం, గనుల రంగం తమ శక్తివంతమైన వ్యాపార లావాదేవీల్లో ఒకటిగా కొనసాగుతుందని అన్నారు. మైనింగ్ ఆపరేషన్స్, నిర్మాణ స్థలాల కోసం ఈ ట్రక్కులు ప్రధానంగా నిలుస్తాయని వెల్లడించారు.