
పచ్చదనం వైపు అడుగులు వేద్దాం
కొరుక్కుపేట: పచ్చదనం వైపు అడుగులు వేద్దామని సదరన్ రైల్వే ఉమెన్స్ హెడ్‌క్వార్టర్స్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఆర్‌డబ్ల్యూహెచ్మో) అధ్యక్షురాలు సోనియా సింగ్ పిలుపునిచ్చారు. సదరన్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లేడీస్ ఆర్గనైనజేషన్ (ఫిక్కీఫ్లో) సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాయి. సోనియా సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రయ స్కూల్ ఫర్ స్పెషల్ చిల్డ్రెన్ ఆవరణలో మొక్కలు నాటారు.