తిరుచ్చిపై సూర్యనారాయణుడి వైభవం | - | Sakshi
Sakshi News home page

తిరుచ్చిపై సూర్యనారాయణుడి వైభవం

Jun 6 2025 6:11 AM | Updated on Jun 6 2025 6:11 AM

తిరుచ్చిపై సూర్యనారాయణుడి వైభవం

తిరుచ్చిపై సూర్యనారాయణుడి వైభవం

చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వెలసిన శ్రీసూర్యనారాయణ స్వామి వారు గురువారం సాయంత్రం బంగారు తిరుచ్చి వాహనంపై భక్తులను కటాక్షించారు. స్వామివారి జన్మనక్షత్రమైన హస్త సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేపట్టారు. అనంతరం స్వామివారిని వజ్రవైఢూర్యాలు, మరకత మాణిక్యాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement