నా కేరీర్‌లో ముఖ్యమైన చిత్రం కరాటే బాబు | - | Sakshi
Sakshi News home page

నా కేరీర్‌లో ముఖ్యమైన చిత్రం కరాటే బాబు

Jun 3 2025 2:16 PM | Updated on Jun 3 2025 2:16 PM

నా కేరీర్‌లో ముఖ్యమైన చిత్రం కరాటే బాబు

నా కేరీర్‌లో ముఖ్యమైన చిత్రం కరాటే బాబు

తమిళసినిమా: నటుడు రవిమోహన్‌ ఒక పక్క వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటూనే మరో పక్క వృత్తి పరంగా ముందుకు దూసుకుపోతున్నారు. కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారనే చెప్పాలి. ఈయన ప్రస్తుతం కరాటే బాబు అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనిపై ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న రవిమోహన్‌ తన చిత్రాల వివరాలను వెల్లడించారు. ఆయన చెబుతూ తాను కథానాయకుడిగా నటిస్తున్న కరాటే బాబు చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోందని చెప్పారు. దీని షూటింగ్‌ చివరి దశకు చేరుకుందన్నారు. ఈ చిత్రంలో తనను తానే ఇంతకు ముందెప్పుడూ చూడలేదన్నారు. కొత్త ప్రయత్నం చేయాలనే భావనే ఈ కరాటే బాబు అని, ఇది తన కెరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇకపోతే తాను నటించిన జీనీ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం గ్రాఫిక్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం తెరపైకి రానుందని తెలిపారు. అదే విధంగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న పరాశక్తి చిత్ర షూటింగ్‌ జరుగుతోందని చెప్పారు. అందులో తనది ముఖ్య కథా పాత్ర అని చెప్పవచ్చునన్నారు. అందులో కొన్ని కొత్త విషయాలను ప్రయత్నిస్తున్నట్లు రవిమోహన్‌ చెప్పారు. ఈయన త్వరలో మెగాఫోన్‌ పట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన తెరకెక్కించనున్న చిత్రంలో యోగిబాబు కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం.

నటుడు రవిమోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement