
తమిళంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నా..!
తమిళసినిమా: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హిట్ –ది థర్డ్ కేస్.వాల్ పోస్టర్ సినిమా, ఇనానిమస్ ప్రొడక్షనన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నటి శ్రీనిధి శెట్టి నాయకిగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ చాయాగ్రహణం, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం,ఋ మలయాళం హిందీ ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో సినిమాకారన్ సంస్థ విడుదల చేస్తోంది. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న నాని శుక్రవారం సాయంత్రం చైన్నెకి వచ్చారు ఆయనతోపాటూ నటి శ్రీనిధి శెట్టి కూడా వచ్చారు. చైన్నెలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ తాను చైన్నెకి ఎప్పుడు వచ్చినా సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుందన్నారు. త్వరలోనే విలేకరుల సమావేశంలో తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు. తనను నటుడుగా తీర్చిదిద్దింది తమిళ సినిమానే అని చాలా చార్లు చెప్పానన్నారు. 2012 13 ప్రాంతంలో తాను చైన్నె నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు తమిళ ప్రవేక్షుల ప్రేమాభిమానాలు తనపై అధికం అవుతూనే ఉన్నాయన్నారు. నేరుగా తమిళ చిత్రంలో నటించాలన్న ఆసక్తి ఉందన్నారు. సరైన అవకాశం వస్తే దానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఇకపోతే హిట్– ది థర్డ్ కేస్ చిత్రం మాత్రమే కాదని అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చే రూపకల్పన అని పేర్కొన్నారు. ఇంతకుముందు వచ్చిన హిట్, హాట్ 1 చిత్రాలకు దీనికి ఏమాత్రం సంబంధం ఉండదని చెప్పారు. దీని కథ నేపథ్యం కొత్తగా ఉంటాయన్నారు. థియేటర్లో అభిమానులు ఎంజాయ్ చేసే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ జానర్‌లో సాగే ఒక అరుదైన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని నాని పేర్కొన్నారు. ఇది తనకు తెలుగులో తొలి చిత్రం అని కేజీఎఫ్ –2 చిత్రం విడుదల తర్వాత తనను గుర్తుపెట్టుకుని ఇందులో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు శైలేష్ కొలను, నటుడు నానికి థాంక్స్ అని శ్రీనిధి శెట్టి పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు నాని ధరించిన చొక్కాపై పలు కొటేషన్స్‌తో కూడిన ఆంగ్ల పదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చొక్కా వెనుక భాగంలో లవ్ ఫ్రమ్ తమిళనాడు అనే పదాలు ఉండడం పెద్ద చర్చకు దారితీసింది.