తిరుమలగిరిలో పార్కింగ్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తిరుమలగిరిలో పార్కింగ్‌ కష్టాలు

Apr 21 2025 8:15 AM | Updated on Apr 21 2025 8:15 AM

తిరుమలగిరిలో పార్కింగ్‌ కష్టాలు

తిరుమలగిరిలో పార్కింగ్‌ కష్టాలు

తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీలో పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా కొనుగోలు చేసేందుకు స్థానిక తెలంగాణ చౌరస్తాకు వస్తే అవస్థలు తప్పడం లేదు. రోడ్డు కొందరు ఇంటి యజమానులు భవనాలు నిర్మించి వాటి ముందు ఉన్న స్థలాలను కూడా కిరాయిలకు ఇస్తున్నారు. దీనికి తోడు షాపులు, హోటళ్లు, ఇతర దుకాణాల ముందు వాహనాలు, ఇతర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపాల్సి వస్తుంది. దీంతో పోలీసులు ఆ వాహనాల ఫొటోలు తీసి జరిమానాలు విధిస్తున్నారు.

సాయంత్రం వేళ నరకమే..

సూర్యాపేట–జనగామ, మోత్కూరు–తొర్రూరు ప్రధాన రహదారుల్లో సాయంత్రం సమయంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా తొర్రూరు రోడ్డు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కొంత మంది ఇంటి యజమానులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు వందలాది వాహనాలు వెళ్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంటుంది. గతంలో పలువురు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, రోడ్లు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఫ సూర్యాపేట–జనగామ,

మోత్కూరు–తొర్రూరు రహదారుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం

ఫ హోటళ్లు, ఇతర దుకాణాల

ఎదుట వాహనాల నిలిపివేత

ఫ జరిమానా విధిస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement