ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం తగదు | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం తగదు

Published Fri, May 10 2024 8:05 PM

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై  దుష్ప్రచారం తగదు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో రానున్న రోజుల్లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కలుగుతుందని, భూ వివాదాలు తగ్గుతాయని సీనియర్‌ న్యాయవాది, బీసీ అడ్వకేట్స్‌ జిల్లా అధ్యక్షుడు ఆగూరి ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఈ చట్టంపై అవాస్తవాలను ప్రచారం చేస్తుండటాన్ని ఖండించారు. ఈ చట్టంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించడం తగదన్నారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని తెలిపారు. దీనిని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, అన్ని రాష్ట్రాల్లోనూ టైటిలింగ్‌ యాక్ట్‌ ఉండాలని ఆదేశించిందని, ఆ మేరకే ఏపీ ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసిందని పేర్కొన్నారు. అయితే ఈ చట్టంలో చిన్న మార్పుల కోసం న్యాయవాదుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పునరాలోచన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అమలు ఆగిందని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement