
జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలి
● ఎన్‌హెచ్ –544జీ పనులను
పరిశీలించిన కలెక్టర్ చేతన్
చిలమత్తూరు: జాతీయ రహదారి పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ చేతన్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన కోడూరు థామస్ మన్రోతోపు నుంచి విజయవాడ వరకూ ఆరు లేన్లతో నిర్మిస్తోన్న గ్రీన్‌ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్– 544జీ) పనులను పరిశీలించారు. అదే విధంగా కోడూరు తోపు నుంచి నిర్మిస్తోన్న మరో రహదారి (ఎన్‌హెచ్–716జీ) నిర్మాణ పనులనూ పరిశీలించారు. 24.3 కి.మీ పొడవుతో నిర్మిస్తున్న ఈ రహదారి కోసం రూ.595 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఫిబ్రవరి 2026 నాటికి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట ఎన్‌హెచ్‌ఏఐ పీఐయూ కడప ఇన్ సైట్ ఇంజినీర్ రామకృష్ణ, ఎంఎస్ ధ్రువ్ కన్సల్టెన్సీ ప్రతినిధి జగన్‌మోహన్‌రెడ్డి, రెసిడెంట్ ఇంజినీర్ ఈశ్వరరావు, సర్వే ఇంజినీర్ ప్రభాకరన్, డీబీఎల్ కాంట్రాక్టర్ మనీష్‌చంద్ర దీక్షిత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.