పేరు మాత్రమే పంత్‌.. కానీ పనులు మాత్రం | Yuvraj Singh Hilarious Birthday Wish For Rishabh Pant | Sakshi
Sakshi News home page

పేరు మాత్రమే పంత్‌.. కానీ పనులు మాత్రం

Oct 4 2020 2:54 PM | Updated on Oct 4 2020 11:24 PM

Yuvraj Singh Hilarious Birthday Wish For Rishabh Pant - Sakshi

దుబాయ్‌ : టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సోషల్‌ మీడియా వేదికగా సహచర ఆటగాళ్లను ఆటపట్టించడం.. ట్రోల్‌కు గురి చేయడం సహజమే. తాజాగా నేడు(అక్టోబర్‌ 4) 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న రిషబ్‌ పంత్‌కు యూవీ ఇన్‌స్టా వేదికగా వినూత్న రీతిలో బర్త్‌డే విషెస్‌ తెలిపాడు.

'వాడి పేరు పంత్‌.. చేసే పనులు మాత్రం చిన్నవిగా ఉండవు.. హ్యాపీ బర్త్‌డే రిషబ్‌ పంత్.. ఈ ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నావు. ఇలాగే నువ్వు బ్యాటింగ్‌లో రెచ్చిపోయి ఢిల్లీకి టైటిల్‌ తీసుకురా.'అంటూ కామెంట్‌ చేశాడు.  పంత్‌ బర్త్‌డే సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అతని భారీ షాట్లకు సంబంధించిన ప్రాక్టీస్‌ వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. బీసీసీఐ కూడా పంత్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. ఐపీఎల్‌13వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడుతున్న పంత్‌ శనివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 38 పరుగులు చేసిన పంత్‌ మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Advertisement
 
Advertisement
Advertisement