
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడు టెస్టుల్లో కూడా అరంగేట్రం చేశాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో సూర్యకుమార్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది. దీంతో టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న సూర్యకుమార్ కల నేరవేరింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు సాధించాడు.
30 ఏళ్ల వయస్సు తర్వాత అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా సూర్య రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ 30 ఏళ్ల 181 రోజుల వయస్సులో టీ20ల్లో అరంగేట్రం చేయగా.. వన్డేల్లో 30 ఏళ్ల 307 రోజులు, టెస్టుల్లో 32 ఏళ్ల 148 రోజుల వయస్సులో ఎంట్రీ ఇచ్చాడు.
ఇక తొలి టెస్టుకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో సూర్యకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. మరోవైపు ఆంధ్రా ఆటగాడు శ్రీకర్ భరత్ కూడా ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
చదవండి: Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్ ఉద్విగ్న క్షణాలు