source: X
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో రెండో రౌండ్ మ్యాచ్కు మహారాష్ట్ర జట్టును ప్రకటించారు. స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. రెగ్యులర్ కెప్టెన్ అయిన రుతురాజ్ జట్టులోకి వచ్చినా కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం పృథ్వీ షాకే అప్పగించారు.
సర్సీసెస్తో జరిగిన తొలి మ్యాచ్కు రుతురాజ్ అందుబాటులో లేని (భారత-ఏ జట్టుకు ప్రాతినిథ్యం) నేపథ్యంలో షాకు తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆ మ్యాచ్లో సర్వీసెస్పై మహారాష్ట్ర 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో షా కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్లో 70 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మరింత పటిష్టంగా మారిన మహారాష్ట్ర బ్యాటింగ్
రుతురాజ్ రాకతో మహారాష్ట్ర బ్యాటింగ్ విభాగానికి మరింత బలం చేకూరింది. ఇప్పటికే పృథ్వీ షా, దివిజయ్ పాటిల్, అంకిత్ బావ్నే, హర్షల్ కాటే, సిద్ధేశ్ వీర్, ముకేశ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, విక్కీ ఓత్స్వాల్, సౌరభ్ నవలే తదితరు బ్యాటర్లు జట్టులో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర-ఝార్ఖండ్ మ్యాచ్ అక్టోబర్ 18 నుంచి 26 వరకు పుణేలో జరగనుంది.
ఇదీ చదవండి: భారత్ పర్యటనకు ఇంగ్లండ్ జట్ల ప్రకటన


