T20 World Cup 2022: ఇదేమి జెర్సీరా బాబు.. పుచ్చకాయలా ఉంది! మీకో దండం!

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022 కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ కొత్త జెర్సీని సోమవారం అవష్కరించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇక పాకిస్తాన్ కొత్త జెర్సీపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దారుణంగా ట్రోలు చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ముదురు ఆకుపచ్చ లేదంటే లేత ఆకుపచ్చ రంగు జెర్సీలు ధరిస్తూ వస్తుంది. అయితే ఈ రెండు రంగులు కలపి కొత్త జెర్సీని పీసీబీ తాయారు చేసింది. అయితే అభిమానులు మాత్రం పాకిస్తాన్ జెర్సీ పుచ్చకాయను తలపించేలా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.
Pakistan fans trolling Indian jersey..
~Meanwhile Pakistan jersey.. pic.twitter.com/4wGc3vDiK3
— รѵҡ ∂αเℓεε✨ (@GrimRea27782254) September 18, 2022
మరి కొంత మంది సెంటర్ ఫ్రూట్ మింగిల్ చాక్లెట్ కవర్‌తో ఈ జెర్సీని పోలుస్తున్నారు. కాగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్-2022 కోసం భారత్, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి జట్లు తమ న్యూ జెర్సీలను లాంచ్ చేశాయి.
Pakistan jersey pic.twitter.com/KOvpeQpfxc
— Vishal Patel (@Vishal_dhoni07) September 18, 2022
𝐓𝐡𝐞 𝐛𝐢𝐠 𝐫𝐞𝐯𝐞𝐚𝐥!
Presenting the official Pakistan T20I Thunder Jersey'22 ⚡
Order the official 🇵🇰 shirt now at https://t.co/A91XbZsSbJ#GreenThunder pic.twitter.com/BX5bdspqt1
— Pakistan Cricket (@TheRealPCB) September 19, 2022
చదవండి: LLC 2022: మిచెల్ జాన్సన్‌కు వింత అనుభవం.. హోటల్ గదిలో పాము!
మరిన్ని వార్తలు