Asia Cup 2022: ఉత్కంఠ పోరులో భారత్‌పై విజయం.. సంబరాల్లో మునిగి తేలిన పాక్‌ ఆటగాళ్లు!

Pakistan players wild celebrations after thrilling win over India - Sakshi

ఆసియాకప్‌-2022లో పాకిస్తాన్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్‌ వేదికగా భారత్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌.. మరో బంతి మిగిలూండగానే చేధించింది. కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించగానే పాక్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో పాక్‌ ఆటగాళ్లు అఖరి ఓవర్‌ జరుగుతున్న క్రమంలో చాలా టెన్షన్‌ పడుతూ కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్‌ బాబర్‌ ఆజం అయితే డ్రెస్సింగ్‌ రూమ్‌లో అటూ ఇటూ తిరుగుతూ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్‌ 6న శ్రీలంకతో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరాలంటే శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌ జట్లపై ఖచ్చితంగా విజయం సాధించాలి.

చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top