దుబాయి చేరుకున్న ముంబై ఆటగాళ్లు.. | Mumbai Indians star Rohit Sharma Jasprit Bumrah and Others Reach Abu Dhabi | Sakshi
Sakshi News home page

IPL 2021: దుబాయి చేరుకున్న ముంబై ఆటగాళ్లు..

Sep 12 2021 11:31 AM | Updated on Sep 20 2021 11:27 AM

Mumbai Indians star Rohit Sharma Jasprit Bumrah and Others Reach Abu Dhabi - Sakshi

దుబాయ్‌: భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య  జరగాల్సిన ఐదో టెస్టు అర్థవంతంగా రద్దు కావడంతో  టీమిండియా ఆటగాళ్లు, ఐపీఎల్ 2021 రెండో దశ కోసం యూఏఈ చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్  స్టార్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు చేరుకున్నారు. వీరి వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అబుదాబి విమానాశ్రయంలో వీరికి  కరోనా పరీక్షలు నిర్వహించారు.

కాగా ఇంగ్లండ్‌ నుంచి యూఏఈ చేరుకున్న ముంబై ఆటగాళ్లు బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండునున్నారు. తర్వాత జట్టు బయోబబుల్‌లో కలుస్తారని ముంబై యాజమాన్యం తెలిపింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు కూడా ప్రత్యేక విమానంలో యూఏఈకు చేరుకోనున్నారు.

చదవండి: IPL 2021: బెయిర్‌ స్టో స్థానంలో విండీస్‌ స్టార్‌ ఆటగాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement