Siraj: అబ్బాయిలు ఏడ్వకూడదని నాన్న చెప్పేవాడు.. కానీ ఆపుకోలేక..! | Mohammed Siraj Emotional Tweet In Remembrance Of His Father | Sakshi
Sakshi News home page

తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ట్వీట్‌ చేసిన టీమిండియా స్టార్‌ పేసర్‌

Nov 11 2021 5:04 PM | Updated on Nov 11 2021 5:55 PM

Mohammed Siraj Emotional Tweet In Remembrance Of His Father - Sakshi

Mohammed Siraj Emotional Tweet: టీమిండియా స్టార్‌ బౌలర్‌, హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌.. చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈ ట్వీట్‌లో సిరాజ్‌ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. అబ్బాయిలు ఎప్పుడూ ఏడ్వకూడదని నాన్న చెప్పేవారని, దీంతో బహిరంగంగా ఉన్నప్పుడు బాధను దిగమింగుకోగలిగినా.. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను.. మిస్‌ యు డాడ్‌, లవ్‌ యు డాడ్‌ అని తండ్రిని తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా, సిరాజ్‌ ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్‌ పర్యటనలో ఉండగా అతని తండ్రి మరణించిన విషయం తెలసిందే.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సిరాజ్‌ చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు స్టార్‌ పేసర్‌ బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో అతని స్థానాన్ని సిరాజ్‌ భర్తీ చేసే అవకాశం ఉంది. 
చదవండి: హేడెన్‌కు ఖురాన్‌ను బహుకరించిన రిజ్వాన్‌.. పాక్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement