Ind Vs Sa 3rd ODI: రాహుల్‌ చక్కగా కెప్టెన్సీ చేశాడు.. ఇదో కనువిప్పు: ద్రవిడ్‌

Ind Vs Sa: Rahul Dravid Backs KL Rahul And Says Its Eye Opener On White wash - Sakshi

Rahul Dravid Comments On KL Rahul Captaincy: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు సారథ్యం వహించిన టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు చేదు అనుభవమే ఎదురైంది. కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి సిరీస్‌లోనే వైట్‌వాష్‌కు గురికావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌కు అండగా నిలబడ్డాడు. సారథిగా తన బాధ్యతను చక్కగా నెరవేర్చాడని ప్రశంసించాడు. 

ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేస్తున్నాడని, అనుభవం దృష్ట్యా పోను పోను తానే మెరుగపడతాడని.. సారథిగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇ‍క సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను కోల్పోగా... వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో ఏకంగా వైట్‌వాష్‌కు గురైంది. దీంతో హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు విదేశీ గడ్డపై తొలి సిరీస్‌లోనే తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో మూడో వన్డే అనంతరం ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా... ‘ఇది మాకు కనువిప్పు లాంటిది. మా నైపుణ్యాలను మైదానంలో సరిగ్గా వినియోగించుకోలేకపోయాం. వన్డే క్రికెట్‌ ఆడి చాలా రోజులైంది కదా. ఇక ఇప్పుడు వరల్డ్‌కప్‌ నేపథ్యంలో వరుస మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి లోపాలు దిద్దుకుని ముందుకు సాగాలి. నిజానికి ఈ సిరీస్‌లో రెగ్యులర్‌ ఆల్‌రౌండర్లు మిస్సయ్యారు. ఆరు, ఏడు, ఎనిమిదో స్థానాల్లో ఆడాల్సిన ఆటగాళ్లు సెలక్షన్‌కు అందుబాటులో లేరు. వాళ్లు తిరిగి జట్టుతో చేరితే పటిష్టంగా మారుతుంది’’ అని ద్రవిడ్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా- వెస్టిండీస్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: ENG vs Wi: అయ్యో పాపం విండీస్.. ఆఖ‌రి ఓవ‌ర్‌లో 28 ప‌రుగులు.. అయినా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top