Ind Vs Sa 1st Test- Day 4: Ind Vs Sa: నాలుగో రోజు ముగిసిన ఆట..

Ind Vs Sa 1st Centurion Test: Day 4 Highlights And Updates In Telugu - Sakshi

Ind Vs Sa 1st Test- Day 4 Updates 

నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 94పరుగులు చేసింది. ప్రొటీస్‌ విజయానికి 211 పరుగుల దూరంలో ఉండగా.. టీమిండియా విజయానికి 7 వికెట్ల దూరంలో ఉంది.

7:46 PM: 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా రెండో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కీగన్‌ పీటర్సన్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. డీన్‌ ఎల్గర్‌ 24, వాండర్‌ డుసెన్‌ 1 క్రీజులో ఉన్నారు.

6:51 PM: 305 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న సౌతాఫ్రికా టీ విరామ సమయానికి వికెట్‌ నష్టానికి 22 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంటే.. సౌతాఫ్రికా గెలవాలంటే మరో 283 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం డీన్‌ ఎల్గర్‌ 9, కీగన్‌ పీటర్సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

5:53 PM: టీమిండియా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులుకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. రిషబ్‌ పంత్‌ 34 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. కేఎల్‌ రాహుల్‌ 23, అజింక్యా రహానే 20 పరుగులు చేశారు. ప్రొటీస్‌ బౌలర్లలో రబాడ 4, మార్కో జాన్సెన్‌ 3, ఎంగిడి 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని టీమిండియా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

5:34 PM: రవిచంద్రన్‌ అశ్విన్‌(20) రూపంలో టీమిండియా ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 47 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పంత్‌ 28, షమీ 0 పరుగులతో​ ఆడుతున్నారు. టీమిండియా 290 పరుగుల ఆధిక్యంలో ఉంది.

4:41 PM: 16 పరుగులు చేసిన పుజారా ఎన్గిడి బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 109 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం భారత్‌ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. రహానే 20, పంత్‌ 2 పరుగులతో ఆడుతున్నారు.

4:26 PM: విరాట్‌ కోహ్లి(18) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. మార్కో జాన్సెన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 32వ ఓవర్‌ తొలి బంతికి కోహ్లి డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. పుజారా 16, రహానే 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా ఓవరాల్‌గా 224 పరుగులు ఆధిక్యంలో ఉంది.

3: 30 PM: లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు:  79/3. 209 పరుగుల ఆధిక్యం. కోహ్లి 18 పరుగులు, పుజారా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

2: 55 PM: కేఎల్‌ రాహుల్‌ రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్‌లో రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఛతేశ్వర్‌ పుజారా క్రీజులో ఉన్నారు.

2: 36 PM: 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 50/2 (20) 

2: 00 PM: రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
రబడ బౌలింగ్‌లో మల్దర్‌కు క్యాచ్‌ ఇచ్చి శార్దూల్‌ ఠాకూర్‌ అవుటయ్యాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. కేఎల్‌ రాహుల్‌, ఛతేశ్వర్‌ పుజారా క్రీజులో ఉన్నారు.
స్కోరు: 34/2 

1: 58 PM: 12 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 30/1

1: 40 PM
రివ్యూ వేస్ట్‌ చేసుకున్న ప్రొటిస్‌
మార్కో జాన్‌సెన్‌ బౌలింగ్‌లో బంతి శార్దూల్‌ ప్యాడ్లను తాకినట్టుగా కనిపించడంతో ప్రొటిస్‌ అప్పీలు చేయగా అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ క్రమంలో రివ్యూకు వెళ్లిన ఎల్గర్‌ బృందానికి నిరాశే మిగిలింది. బంతి ఎక్కువ ఎత్తు నుంచి వెళ్లడంతో శార్దూల్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.

దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆట ఆరంభమైంది. మూడో రోజు ఆట ముగిసే సరికి 146 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన... ఒక వికెట్‌ నష్టానికి 16 పరుగుల వద్ద ఆటను ప్రారంభించింది. కేఎల్‌ రాహుల్‌, శార్దూల్‌ ఠాకూర్‌ క్రీజులో ఉన్నారు. ఇక మయాంక్‌ అగర్వాల్‌ మంగళవారం నాటి ఆటలో మార్కో జాన్‌సెన్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే.

తుదిజట్లు:
భారత్‌: కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.

దక్షిణాఫ్రికా:
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, క్వింటన్‌ డికాక్‌(వికెట్‌ కీపర్‌), వియాన్‌ మల్దర్‌, మార్కో జాన్‌సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబడ, లుంగి ఎంగిడి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top