Hardik Pandya Meets Kieron Pollard And Family At His Home - Sakshi
Sakshi News home page

పొలార్డ్‌ ఇంట పాండ్యా.. ఇది జరగకుండా విండీస్‌ టూర్‌ ముగియదంటూ కామెంట్స్‌

Aug 4 2022 8:39 PM | Updated on Aug 4 2022 9:47 PM

Hardik Pandya Meets Kieron Pollard And Family At His Home - Sakshi

విండీస్‌ పర్యటనలో వరుస విజయాలతో (ఒక్క టీ20 మినహాయించి) దూసుకుపోతున్న టీమిండియా ఖాళీ సమయం దొరికితే కరీబియన్‌ దీవుల్లో చక్కర్లు కొడుతూ సేద తీరుతుంది. భారత జట్టులోని మెజారిటీ సభ్యులు వివిధ పర్యాటక ప్రదేశాలను విజిట్‌ చేయగా.. స్టార్‌ ఆల్‌రైండర్‌ హార్ధిక్‌ పాండ్యా మాత్రం తన మాజీ ఐపీఎల్‌ సహచరుడు, తనెంతో అభిమానించే విండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ ఇంటిని సందర్శించి, అతని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. 

టీమిండియా విండీస్‌ పర్యటన ముగిసే ముందు హార్ధిక్‌.. పోలార్డ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. కింగ్‌ పొలార్డ్ ఆతిథ్యం స్వీక‌రించ‌కుండా విండీస్ ప‌ర్యట‌న ముగియ‌దని.. పోలార్డ్‌ తన ఫేవరెట్‌ అని, అన్నతో సమానమని, తనకు ఆతిధ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని కామెంట్‌ చేశాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, విండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతానికి (3 మ్యాచ్‌ల్లో)  టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తదుపరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగనున్నాయి. విండీస్‌ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్‌ను 3-0తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 
చదవండి: రోహిత్‌ బాటలోనే కేఎల్‌ రాహుల్‌.. హార్దిక్‌కు ప్రమోషన్‌!

Advertisement
 
Advertisement
Advertisement