ENG vs WI: డెబ్యూ టెస్టులోనే ఇంగ్లండ్‌ బౌలర్‌కు వింత పరిస్థితి

England Bowler Joins Unwanted List Unfortunate Debutants With No-Ball - Sakshi

ఒక బౌలర్‌ తాను ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే వికెట్‌ తీసి అరంగేట్రంను గొప్పగా మలుచుకోవాలని అనుకుంటాడు. అలాంటి అవకాశం కోసం ప్రతీ బౌలర్‌ ఎదురుచూస్తుంటాడు. కొందరిని ఆ అదృష్టం వరిస్తుంది.. మరికొందరికి అవకాశం రాకపోవచ్చు. కానీ ఒక బౌలర్‌కు తన తొలి మ్యాచ్‌లోనే వికెట్‌ వచ్చినప్పటికి.. అది నోబాల్‌ అవడంతో వికెట్‌లెస్‌ బౌలర్‌గా మిగిలిపోవడం అరుదుగా చూస్తుంటాం. తాజాగా ఆ జాబితాలో చేరిపోయాడు ఇంగ్లండ్‌కు చెందిన సాకిబ్‌ మహమూద్‌.

ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ద్వారా సాకిబ్‌ మహమూద్‌ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్‌ 507 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆడిన విండీస్‌ 3 వికెట్ల నష్టానికి 229 పరుగులతో ధీటుగానే బదులిస్తుంది. క్రీజులో కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌తో పాటు జెర్మన్‌ బ్లాక్‌వుడ్‌ 65 పరుగులతో ఆడుతున్నాడు. అప్పటికే ఈ ఇద్దరి మధ్య 128 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది.

మహమూద్‌ అప్పటికే 14 ఓవర్లు వేసినప్పటికి ఒక్క వికెట్‌ దక్కలేదు. కాగా మరోసారి బౌలింగ్‌కు వచ్చిన మహమూద్‌ 136 కిమీవేగంతో పర్‌ఫెక్ట్‌ యార్కర్‌ను వదిలాడు. అంతే బంతి క్రీజులో ఉన్న బ్లాక్‌వుడ్‌ను దాటుకుంటూ మిడిల్‌స్టంప్‌ను పడగొట్టింది. ఇంకేముంది సాకిబ్‌ తొలి టెస్టు వికెట్‌ అందుకున్నాననే ఆనందంలో  మునిగిపోయాడు. ఇక్కడే ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో షాకవడం సాకిబ్‌ వంతైంది. అలా తాను ఆడుతున్న తొలి టెస్టులో వికెట్‌ సాధించే అవకాశం కోల్పోయాడు.  
బెన్‌ స్టోక్స్‌
కానీ సాకిబ్ మాత్రం ఒక అరుదైన జాబితాలో  చేరిపోయాడు. తొలి టెస్టు ఆడుతూ వికెట్‌ తీసినప్పటికి అది నోబాల్‌ అవడంతో ఆ అవకాశం కోల్పోయిన క్రికెటర్‌గా సాకిబ్‌ నిలిచాడు. ఇంతకముందు ఇంగ్లండ్‌ క్రికెటర్లు బెన్‌ స్టోక్స్‌( 2013లో బ్రాడ్‌ హడిన్‌), మార్క్‌ వుడ్‌(మార్టిన్‌ గప్టిల్‌, 2015లో), టామ్‌ కరన్( డేవిడ్‌ వార్నర్‌, 2017లో)‌, మాసన్‌ క్రేన్‌( ఉస్మాన్‌ ఖవాజా, 2018లో).. ఇలాగే తమ తొలి టెస్టు వికెట్‌ను సాధించే ప్రయత్నంలో నోబాల్‌ వేసి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. తాజాగా వీరి సరసన సాకిబ్‌ మహమూద్‌ కూడా చేరిపోయాడు.


మార్క్‌ వుడ్‌
కాగా తొలి వికెట్‌ నోబాల్‌గా తేలినప్పటికీ.. ఈ మ్యాచ్లో సాకిబ్‌ నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం.


టామ్‌ కరన్‌

చదవండి: Yastika Bhatia: 'క్రికెట్‌లో రాణించేందుకు ఇష్టమైనవి వదులుకున్నా'

PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్‌ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top