Pakistan Players Babar Azam And Imam Clash In Dressing Room, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Pakistan Players Clash Video: డ్రెస్సింగ్‌రూంలో పాక్‌ ఆటగాళ్ల ‘గొడవ’.. బాబర్‌ ఆజం ప్రతీకారం!

Dec 8 2021 1:24 PM | Updated on Dec 8 2021 1:34 PM

Ban Vs Pak: Babar Azam Clash With Player Dressing Room Video Viral - Sakshi

Ban Vs Pak- Babar Azam: డ్రెస్సింగ్‌రూంలో పాక్‌ ఆటగాళ్ల ‘గొడవ’.. బాబర్‌ ఆజం ప్రతీకారం!

Pakistan Players Babar Azam And Imam Clash In Dressing Room, Video Goes Viral: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన బాబర్‌ ఆజం బృందం.. తొలి టెస్టులో విజయం సాధించి జోష్‌లో ఉంది. అదే జోరును కొనసాగిస్తూ రెండో టెస్టు కూడా గెలిచి సిరీస్‌ సొంతం చేసుకొనేందుకు సిద్ధమైంది. ఇలా వరుస విజయాలు సాధించడం పట్ల పీసీబీ సంతోషంగా ఉంటే.. ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు మాత్రం డ్రెస్సింగ్‌రూంలో ‘గొడవపడి’ గందరగోళం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రెండో టెస్టు మూడో రోజు ఆట వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో.. కెప్టెన్‌ బాబర్‌ ఆజం, ఇమామ్‌-ఉల్‌-హక్‌ డ్రెస్సింగ్‌ రూంలో క్రికెట్‌ ఆడారు. తొలుత బాబర్‌ బ్యాటింగ్‌ చేయగా.. ఇమామ్‌ అతడిని అవుట్‌ చేశాడు. ఇందుకు బాబర్‌ సైతం ధీటుగా బదులిచ్చాడు. ఇమామ్‌ను అవుట్‌ చేసి.. ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే, తాను అవుట్‌ కాలేదంటూ... ఇమామ్‌ వాదించాడు. ఈ క్రమంలో ఇద్దరూ సరదాగా వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆట కొనసాగింది. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. 

చదవండి: India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్‌.. నలుగురు ఆటగాళ్లు దూరం! వాళ్లిద్దరికీ బంపర్‌ ఆఫర్‌!
PAK Vs BAN: బ్యాటింగ్‌ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్‌ చేస్తున్నావా బాబర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement