
బ్రసిలియా : అతి పొడవైన అనకొండ ఇదేనంటూ ఇప్పుడు ట్విట్టర్‌లో ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. బ్రెజిల్‌లోని జింగు నదిలో ఈ 50 అడుగుల పొడవైన అనకొండ ప్రత్యక్షమయ్యిందంటూ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇది ఎంత వరకు నిజమంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇది లేటెస్ట్ వీడియో కాదు. 2018లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ వీడియో చాలా ట్రెండ్ అయ్యింది. తాజాగా ప్రముఖ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియోను పోస్ట్ చేయడంతో మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వ్యూస్, కామెంట్లతో ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ వీడియో నిజం కాదని ఫాక్ట్-చెకింగ్ వెబ్‌సైట్ తేల్చేసింది. 2018లో మొదటిసారి అప్‌లోడ్ చేసిన వీడియోతో పోలిస్తే ఇందులో అనకొండ విస్తీర్ణం కూడా మారిపోయిందని వాస్తవం కంటే చాలా పెద్దదిగా చిత్రీకరించారంటూ పేర్కొంది. అంతే కాకుండా నిజానికి ఇది రోడ్డుపై దాటుతుండగా తీసిన వీడియో అని నదిని కాదంటూ మరో ప్రముఖ వెబ్‌సైట్ ఖౌ కూడా వెల్లడించింది. వీడియోను జాయింట్లుగా కట్ చేసి 50 అడుగులు ఉన్నట్లు చిత్రీకరించారని ఇది ఫేక్ వీడియో అంటూ వివరణ ఇచ్చింది. (‘నమ్మలేకపోతున్నాం.. ఇది అరుదైన అనుభవం’ )
An anaconda measuring more than 50 feet found in the Xingu River, Brazil pic.twitter.com/FGDvyO76sn
— The Dark Side Of Nature (@Darksidevid) October 30, 2020