కబోదీ.. ఇది కాదా అభివృద్ధి | Sakshi
Sakshi News home page

కబోదీ.. ఇది కాదా అభివృద్ధి

Published Thu, May 9 2024 8:05 AM

కబోదీ

పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. ముమ్మరంగా అభివృద్ధి పనులు సాగుతున్నా అవేవీ పచ్చ నేతలకు కనిపించవు. ఎల్లో మీడియాలో రోత రాతలు రాయిస్తూ ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చ దండు పనిగా పెట్టుకుంది. ఒంగోలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించినా అవేవీ లేదన్నట్టు పచ్చ మీడియా విషం చిమ్మడం.. అవే అబద్ధాలను టీడీపీ నేతలు ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. పైప్‌ లైన్‌ పనులు చేస్తున్న ప్రదేశాలు లేదంటే ఎక్కడో కాస్త పెచ్చు లేచిన రోడ్లను క్లోజప్‌లో ఫొటోలు తీసి ఎల్లో మీడియాలో అచ్చేసి శునకానందం పొందుతున్నారు.

ఒంగోలు సబర్బన్‌: భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు వేగంగా చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో గత ఐదేళ్లలో నగర రూపురేఖలు మారాయి. గతంలో అడుగు కూడా వేయలేని ప్రాంతాల్లో నేడు సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే ముగినిపోయే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది. ఇవన్నీ చూడలేని పచ్చ దండు నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తోంది. ‘‘పథకాలు ఇస్తే సరిపోద్దా.. రోడ్లేయలేదు.. కాలువలు కట్టలేదు’’ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడం నగర వాసులకు వెగటు పుట్టిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్లు ఉన్నచోటే మళ్లీ రోడ్లు వేసి ప్రజా ధనం బొక్కేశారన్న విషయం నగర వాసులు ఇంకా మర్చిపోలేదు.

అసత్యాలపై ‘‘ఛీఛీ’’ అంటున్న జనం:

నగరంలో 3 లక్షలకు పైగా జనాభా దాటిపోయింది. అందుకుగాను ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాల కోసం నిధులు కుమ్మరించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కేవలం 58 నెలల కాలంలో రోడ్ల అభివృద్ధి, డ్రెయిన్ల నిర్మాణాల కోసం దాదాపు రూ.115 కోట్లకు పైగా వెచ్చించారు. నగర పాలకల సంస్థ సాధారణ నిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన వివిధ పథకాలను సద్వినియోగం చేసుకొని నగరంలో విస్తృతంగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారు. ఒంగోలు నగరంలో రోడ్ల నిర్మాణాలకు సంబంధించి 514 పనులు మంజూరు చేశారు. అందుకోసం రూ.62.79 కోట్లు కేటాయించారు. వాటిలో 415 రోడ్ల నిర్మాణాల పనులు పూర్తికాగా 99 పనులు చివరి దశలో ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వం రోడ్డు మీద రోడ్డు వేయటంతో ఒంగోలు నగరంలో వర్షం పడితే నీళ్లు బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఆ సమస్యను చక్కదిద్దడానికి నగరంలోని ప్రధాన రోడ్లతో పాటు శివారు ప్రాంతాల్లోని దాదాపు 58 రోడ్లకు రూ.3.26 కోట్లతో మరమ్మతులు చేశారు. అయినా పచ్చ పత్రికల్లో రోత రాతలు రాయడాన్ని జనం అసహ్యించుకుంటున్నారు.

ఒంగోలు అభివృద్ధిపై పచ్చ నేతలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం

నగరంలో రూ.115 కోట్లకు పైగా వెచ్చించి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం రూ.62.79 కోట్లతో సీసీ రోడ్లు, రూ.3.26 కోట్లతో 58 రోడ్లకు మరమ్మతులు 304 సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.47.21 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం అయినా పచ్చ దండు రోత జనాల ఈసడింపు

కబోదీ.. ఇది కాదా అభివృద్ధి
1/1

కబోదీ.. ఇది కాదా అభివృద్ధి

Advertisement
Advertisement