శశిథరూర్‌ ప్రత్యర్ధి ఎవరంటే? | Shashi Tharoor To Contest LS Polls From Thiruvananthapuram Against Rajeev Chandrasekhar | Sakshi
Sakshi News home page

శశిథరూర్‌ ప్రత్యర్ధి ఎవరంటే?

Mar 9 2024 8:53 AM | Updated on Mar 9 2024 9:16 AM

Shashi Tharoor To Contest Lok Sabha Polls From Thiruvananthapuram Against Rajeev Chandrasekhar - Sakshi

తిరువనంతపురం : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ 39 మంది అభ్యర్ధులతో తన తొలి జాబితాను విడుదల చేసింది. 39 మందిలో కేరళ కాంగ్రెస్ నేత శశి థరూర్ తన సొంత నియోజకవర్గం తిరువనంతపురం నుండి పోటీ చేయబోతున్నారు.థరూర్ అదే నియోజకవర్గం నుండి ప్రస్తుతం మూడవసారి పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.

2009లో తొలిసారి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన థరూర్ గతంలో కాంగ్రెస్ హయాంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

ఇక రానున్న ఎన్నికల్లో శశి థరూర్ ప్రత్యర్థి కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి - రాజీవ్ చంద్రశేఖర్. మూడుసార్లు రాజ్య సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించన ఆయన తొలిసారి లోక్‌సభకు పోటీ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement