ఇబ్బందులకు గురవుతున్నాం | - | Sakshi
Sakshi News home page

ఇబ్బందులకు గురవుతున్నాం

Jun 8 2025 12:34 AM | Updated on Jun 8 2025 12:34 AM

ఇబ్బం

ఇబ్బందులకు గురవుతున్నాం

పట్టణంలోని ప్రధానరోడ్ల అభివృద్ధి పనులు నత్తనడకన.. నాసిరకంగా సాగుతున్నాయి. బల్దియా అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలి. పనుల్లో జాప్యంతో ఇబ్బందులకు గురవుతున్నాం.

– దాడి సంతోష్‌, న్యాయవాది

త్వరగా పూర్తిచేయాలి

పట్టణంలోని రోడ్లపై పోసిన కంకరతో కష్టాలు పడుతున్నాం. పనుల నిమిత్తం పెద్దపల్లికి వస్తే వాహనాలకు మరమ్మతులు తప్పడం లేదు. నెలల తరబడి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు చొరవ చూపడం లేదు. పనులు త్వరగా పూర్తిచేయాలి.

– మిట్టపల్లి శ్రీనివాస్‌, పెద్దబొంకూర్‌

పురోగతిలో పనులు

జిల్లా కేంద్రంలో చేపట్టిన రహదారుల విస్తరణ, మురుగునీటి కాలువల పనులు పురోగతిలో ఉన్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేస్తాం. డ్రైనేజీల్లో చేరుతున్న మురుగునీటిని తొలగిస్తూ పనులు చేయాల్సి రావడంతో కొంతసమయం పడుతోంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తిచేస్తాం.

– సతీశ్‌, ఏఈ, పెద్దపల్లి మున్సిపాలిటీ

ఇబ్బందులకు గురవుతున్నాం
1
1/1

ఇబ్బందులకు గురవుతున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement