
నామినేషన్, ఓటరు జాబితా, దరఖాస్తుల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియలో కీలకంగా పనిచేశాం. ఈవీఎంల పర్యవేక్షణ, సీఆర్‌పీఎఫ్ బలగాలు, చెక్‌పోస్ట్‌ల నిర్వహణ, పర్యవేక్షణ, కంట్రోల్‌రూమ్, హెల్ప్‌లైన్ తదితర అతికీలక వ్య వహహారాలు చక్కగా నిర్వర్తించాం. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వరుస సంఖ్య, సెక్టార్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వేర్స్, పీవో, ఏపీవోల నియామకం, ఈవీఎంల ర్యాండమైజేషన్, కమిషనింగ్‌పై దృష్టి సారించాం. అధికారులను అప్రమత్తం చేశాం.
– అరుణశ్రీ, అడిషనల్ కలెక్టర్
నేపథ్యం..
జగిత్యాల జిల్లా కొండాపూర్ పట్టణానికి చెందిన జల్ద అరుణశ్రీ 2012 గ్రూప్–1 ద్వారా కరీంనగర్ డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నిర్మల్ ఆర్డీవోగా, జగిత్యాల అదనపు కలెక్టర్‌గా సేవలు అందించారు. 2018లో పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరారు.