భారతమాలను త్వరగా పూర్తి చేయాలి
కొరాపుట్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విశాఖపట్నం–రాయపూర్ ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్ భారతమాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి ఆదేశించారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటోరింగ్ కమిటీ (దిశ) సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఒడిశాలో నబరంగ్‌పూర్, కొరాపుట్ జిల్లాల మీదుగా రోడ్డు నిర్మాణం సాగుతోందని, పనులు పూర్తయితే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. నబరంగ్‌పూర్–జయపూర్ మధ్య నిర్మాణం కానున్న రైల్వేలైన్ కోసం భూసేకరణలో సమస్యలు తొలగించాలన్నారు. జిల్లాలో 152 గ్రామాల్లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సంతృప్తికరంగా లేవన్నారు. సమావేశానికి గృహనీటి పారుదల, మేజర్ ఇరిగేషన్ విభాగాల అధికారులు హాజరుకాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కలెక్టర్ మహేశ్వర స్వయ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, రాజధానిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన జరుగుతుండడంల్లో ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వారి తరఫున ప్రతినిధులు హాజరయ్యారు.
భారతమాలను త్వరగా పూర్తి చేయాలి


