
విజయనగరం టౌన్: సనాతన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షిస్తూ.. చారిత్రాత్మక ప్రదేశాలకు పర్యాటకులను అతి తక్కువ ధరలకే తీసుకువెళ్లేందుకుగానూ రైల్వే మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘భారత్ గౌరవ్’ రైలు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో విజయనగరం చేరుకుంది. ఐఆర్‌సీటీసీ ప్రాంతీయ మేనేజర్ చంద్రమోహన్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌ల ఆధ్వర్యంలో జిల్లా నుంచి బయలుదేరిన 25 మంది ప్రయాణికులకు స్వాగతం పలికారు. ఏడు రాత్రులు, ఎనిమిది రోజులు ప్యాకేజీతో పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయోగ తీసుకువెళ్లి, తిరిగి గమ్య స్థానాలకు చేర్చుతుంది. రాత్రి 2.40 గంటలకు రైలు విజయనగరం నుంచి బయలుదేరింది.