ఇటుక బట్టీలకు చెరువుల మట్టి | Sakshi
Sakshi News home page

ఇటుక బట్టీలకు చెరువుల మట్టి

Published Mon, May 6 2024 6:05 AM

ఇటుక బట్టీలకు చెరువుల మట్టి

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): చెరువుల్లోని నల్లమట్టిని నిబంధనలకు విరుద్ధంగా ఇటుకబట్టీలకు తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులుగా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా రాత్రి, పగలూ తేడా లేకుండా దందా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే దందా కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలువురు ఫిర్యాదులు చేసినా.. అధికార యంత్రాంగం స్పందించడం లేదు.

ఇదీ పరిస్థితి..

మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లి, కంజర్‌, మో పాల్‌, ముదక్‌పల్లి, సిర్‌పూర్‌, న్యాల్‌కల్‌, కులాస్‌పూ ర్‌, తదితర గ్రామాల్లో 15 వరకు ఇటుక బట్టీలు ఉ న్నాయి. నల్లమట్టిని ప్రతి వేసవిలో చెరువుల్లో నుంచి తరలించి ఏడాదికి సరిపడా నిల్వలు చేసుకుంటా రు. అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల హడావుడిలో ఉంటే.. ఇక్కడ వ్యాపారులు యథేచ్ఛగా మ ట్టి దందాకు తెరలేపారు. ప్రస్తుతం కాల్పోల్‌, మంచిప్ప చెరువుల నుంచి నల్లమట్టిని తరలిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యాపారు లు మూడు, నాలుగు రోజులుగా టిప్పర్ల ద్వారా ర వాణా చేస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ కాల్పోల్‌ చెరువు నుంచి రూ.3,300, మంచిప్ప నుంచి రూ.3,100 వ రకు వసూలు చేస్తున్నారు. పెద్ద పెద్ద జేసీబీలతో రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా దందా సా గిస్తున్నారు.

టిప్పర్‌ డ్రైవర్లు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు అధికారుల కు ఫిర్యాదు చేశారు. అయినా వారు స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నల్లమట్టి తరలింపునకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి

తరలిస్తున్న అక్రమార్కులు

‘మామూలు’గా తీసుకుంటున్న

అధికార యంత్రాంగం

అధికారులు పట్టించుకోవడం లేదు..

మట్టిని ఇటుకబట్టీలకు తీసుకెళ్లే క్రమంలో టిప్పర్‌ డ్రైవర్లు వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతాయోనని భయాందోళన చెందుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

–ఇందల్‌ నాయక్‌, బైరాపూర్‌

చర్యలు తీసుకుంటాం..

చెరువుల్లోని నల్లమట్టిని పంట పొలాలకు తరలించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. ఇటుకబట్టీలకు తరలించడం మాత్రం నిబంధనలకు విరుద్ధం. ఇటుక బట్టీలకు తరలిస్తున్నట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఒకవేళ అలా జరుగుతున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం.

–రామేశ్వర్‌, తహసీల్దార్‌, మోపాల్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement