అఫ్గాన్‌ అధ్యక్షుడితో జై శంకర్‌ భేటీ

S Jaishankar Meets Afghanistan President In Tashkent - Sakshi

న్యూఢిల్లీ: విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ గురువారం అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీతో తాష్కెంట్‌లో భేటీ అయ్యారు. దేశం నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ అనంతరం వేగంగా మారుతున్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. అఫ్గానిస్తాన్‌ అభివృద్ధి, శాంతి, సుస్థిరతకు భారత్‌ తోడ్పాటు కొనసాగుతుందని ఈ సందర్భంగా జై శంకర్‌ భరోసా ఇచ్చారు.

తజికిస్తాన్‌ రాజధాని దుషాంబేలో రెండు రోజులపాటు జరిగిన షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీవో) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ఉజ్బెకిస్తాన్‌ రాజధాని తాష్కెంట్‌లో జరిగిన కనెక్టివిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అష్రాఫ్‌ ఘనీతో సమావేశమయ్యారు. ఎస్‌సీవో సమావేశాల్లో రష్యా, చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ తదితర దేవాల విదేశాంగ మంత్రులు పాలుపంచుకున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top