హైకోర్టు ఓకే.. సీజేపీ రెడీ.. పోలీసులు అలర్ట్‌! | Cjp Is Preparing For Protest Near Central Park In Delhi On October 16 | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఓకే.. సీజేపీ రెడీ.. పోలీసులు అలర్ట్‌!

Oct 15 2026 7:53 PM | Updated on Oct 15 2026 8:07 PM

Cjp Is Preparing For Protest Near Central Park In Delhi On October 16

ఢిల్లీలో సెంట్రల్‌ పార్క్‌ దగ్గర నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సిద్ధమవుతోంది. అక్టోబర్‌ 16న నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. సీజేపీని నిరోధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే, ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కూడా రెడీ అవుతున్నారు.

కనాట్ ప్లేస్‌లో వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నిరసనను చట్ట ప్రకారం నియంత్రించాలని పోలీసులను ఆదేశించాలంటూ ఓ వీధి వ్యాపారి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారణ జరిపింది. పండుగల సీజన్‌లో నిరసనల కారణంగా మరో వారాంతంలో వ్యాపారం నిలిచిపోతే, వ్యాపారులు, వీధి వ్యాపారులు రోడ్డున పడాల్సి వస్తుందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వాదించారు.

కాగా, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకాలకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్క్‌ వద్ద జాతీయ జెండాలతో సమావేశం కావాలని దేశభక్తులకు సీజేపీ వ్యవస్థాపకుడు పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని ప్రేమించే దేశభక్తులందరూ తరలి రావాలని కోరారు.

జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని మనం నిరూపించి చూపిద్దామని బుధవారం దీప్కే ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఢిల్లీకి రాలేనివారు తమ ప్రాంతాల్లోనే ‘త్రివర్ణ పతాక యాత్రలు’నిర్వహించాలని కోరారు. త్రివర్ణ పతాకమే మన గర్వకారణమని చాటి చెప్పాలని సూచించారు. తాను జెండా ఎగురవేస్తానని చెప్పారు. ప్రభుత్వం తనను కూడా జైలుకు పంపవచ్చని  దీప్కే అన్నారు.

ఇదీ చదవండి: ఒక్కరి కోసం సొంత దేశ ప్రజలతోనే మోదీ, షా యుద్ధం: దీప్కే

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement