కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..!

Centre suspends biometric attendance for govt employees - Sakshi

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన గమనిక. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే, ఉద్యోగులందరూ తమ హాజరు రిజిస్టర్లను మాన్యువల్'గా నిర్వహించాల్సిన అవసరం ఉందని సిబ్బందికి మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది.

"గత కొన్ని రోజులుగా #COVID కేసులు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని, తదుపరి ఆదేశాల వచ్చే వరకు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిలిపివేశాం. ప్రధాని @NarendraModi నాయకత్వంలో, ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు" అని జితేంద్ర సింగ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. అన్ని విభాగాల అధిపతులు కూడా ఉద్యోగులందరూ అన్ని వేళలా మాస్కులు ధరించేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఏడాది ఉద్యోగుల ఆరోగ్యాన్ని భద్రతను దృష్టిలో ఉంచుకొని బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయింపు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ తిరిగి నవంబర్‌ 8 నుంచి కరోనా కారణంగా ఉద్యోగులకు అందించిన సౌకర్యాలన్నీ తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఉమేష్‌ కుమార్‌ భాటియా తెలిపారు. 

(చదవండి: గూగుల్‌ సెర్చ్‌లో ట్రెండ్‌ కరోనాదే.. టాప్‌ 10 జాబితా ఇదే!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top