ఆశారాం బాపుకు ఝలక్ ? | Asaram Bapu’s Bail Challenged in Supreme Court | Sakshi
Sakshi News home page

ఆశారాం బాపుకు ఝలక్ ?

Dec 1 2025 3:58 PM | Updated on Dec 1 2025 4:14 PM

Asaram Bapu’s Bail Challenged in Supreme Court

ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బాధితురాలి తరపు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. ఆశారాం బాపుకు అనారోగ్య కారణాలతో  అక్డోబర్ లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

వివాదాస్పద మత గురువు ఆశారం బాపు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తనకు వయసు రీత్యా  తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయని కనుక మెరుగైన చికిత్స కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆశారం బాపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన వయస్సు 86 సంవత్సరాలని వయస్సు రీత్యా వచ్చే సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. వీటిని విచారించిన కోర్టు ఆయనకు అక్డోబర్ లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

అయితే బాధితురాలి తరపు న్యాయవాది ప్రస్తుతం ఆశారాం బాపు ఆరోగ్యంగానే ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఆశారం బాపు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన అహ్మదాబాద్, ఇండోర్, జోధ్‌పూర్ నగరాలు ప్రయాణం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అలా దేశవ్యాప్త పర్యటనలు చేయలేరని పేర్కొన్నారు. దీనిని పరిగణలోకి తీసుకొని కోర్టు ఆశారం బాపుకిచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు.

ఆశారం బాపుపై కేసు ఏమిటి

2013 ఆగస్టు 15న ఆశారం బాపు  దగ్గర్లోని తన ఆశ్రమంలో తనపై ఆత్యాచారం చేశారని 16 ఏళ్ల బాలిక దీంతో ఆశారం బాపుని అరెస్టు చేసి జోద్ పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. రెండు నెలల తరువాత గుజరాత్ లోని సూరత్ ఆశ్రమంలో  ఆశారాం బాపు తన కుమారుడు తమపై అత్యాచారం చేసారని  ఇద్దరు అక్కాచెల్లెల్లు కేసు నమోదు చేశారు. వీటిపై విచారణ జరిపిన జోద్ పూర్ కోర్టు 2018 ఏప్రిల్ 25న ఆశారాం బాపుకు జీవిత ఖైధు విధించింది. ఈ నేపథ్యంలో 12 సంవత్సరాల తరువాత తొలిసారిగా గత అక్టోబర్ లో ఆశారాం బాపుకు తొలిసారిగా  ఈ ఏడాది ప్రారంభంలో బెయిల్ వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement