షార్ట్‌సర్క్యూట్‌తో మద్యం దుకాణం దగ్ధం | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో మద్యం దుకాణం దగ్ధం

Published Sun, Apr 14 2024 2:40 AM

- - Sakshi

శాలిగౌరారం: షార్ట్‌సర్క్యూట్‌తో వైన్స్‌షాపు దగ్ధమైంది. ఈ ఘటన శాలిగౌరారం మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది. అందుకు సంబంధించి ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలో గురుజాల రోడ్డువెంట ఉన్న శ్రీదేవి వైన్స్‌ నిర్వాహకులు శుక్రవారం రాత్రి 10 గంటలకు మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో షాపులోపల విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ జరుగడంతో మంటలు చెలరేగాయి. వెన్స్‌షాపులో నుంచి పొగలు రావడంతో ఓ జ్యూవలరీ షాపు నిర్వాహకుడు గమనించి వెంటనే యజమానికి విషయాన్ని తెలిపాడు. దీంతో అతను చుట్టుపక్కలవారికి చెప్పడంతో వారు వైన్స్‌షాపు నిర్వాహకులకు, అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌లో సమాచారం అందించారు. వైన్స్‌ నిర్వాహకులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో షాపును తెరిచి మంటలను ఆర్పివేశారు. ఈలోగా నకిరేకల్‌ నుంచి ఫైరింజన్‌తో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిస్థాయిలో ఆర్పివేశారు. ఈ మంటల్లో షాపులోని కౌంటర్‌తో పాటూ కౌంటర్‌లో ఉన్న రూ.50 వేల నగదు, క్యాష్‌ కౌంటిగ్‌ మిషన్‌, 8సీసీ కెమరాలు, సిస్టం, ఇన్‌వర్టర్‌, బ్యాటరీ, రెండు స్వైపింగ్‌ మిషన్లు, స్కానర్లతో పాటూ 71 కాటన్ల మద్యం, 15 కాటన్ల బీర్లు, మూడు ఫ్రిజ్‌లు మంటల్లో కాలిపోయాయి. ప్రమాద స్థలాన్ని శనివారం స్థానిక ఎస్‌ఐ ప్రవీణ్‌తో పాటు ఎకై ్సజ్‌ ఎస్‌ఐ షేక్‌ చాంద్‌బిలు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. వైన్స్‌ నిర్వాహకుడు బట్ట సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement
Advertisement