ఓటేశారు.. | Sakshi
Sakshi News home page

ఓటేశారు..

Published Wed, May 15 2024 1:10 AM

ఓటేశారు..

12,41,135
● ఖమ్మం, కొత్తగూడెంలో తక్కువగా పోలింగ్‌ ● పాలేరులో అత్యధికంగా 83.77 శాతం నమోదు

మంది

సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల్లో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 76.09 శాతం పోలింగ్‌ నమోదైంది. 7,87,160 మంది పురుషులకు.. 6,05,969 మంది, 8,43,749 మంది మహిళలకు 6,35,099 మంది ఓటు వేశారు. సంఖ్యాపరంగా మహిళలే ఎక్కువ మంది ఓటు వేసినా.. శాతంలో లెక్కిస్తే పురుషులు 76.98 శాతం, మహిళలు 75.27 శాతం మంది మాత్రమే ఉండడం గమనార్హం.

పాలేరులో అత్యధికంగా..

ఈ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ 2,40,806 మంది ఓటర్లకు గాను 2,01,721 మంది ఓటు వేశారు. అంటే 83.77 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ పాలేరు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. అలాగే ఖమ్మంలో 62.97 శాతం, కొత్తగూడెంలో 69.47 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది.

నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ వివరాలు..

నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు శాతం

ఖమ్మం 3,24,073 2,04,078 62.97

పాలేరు 2,40,806 2,01,721 83.77

మధిర 2,22,160 1,81,815 81.84

వైరా 1,93,389 1,56,762 81.06

సత్తుపల్లి 2,43,943 1,95,979 80.34

కొత్తగూడెం 2,47,494 1,71,928 69.47

అశ్వారావుపేట 1,59,174 1,28,852 80.95

మొత్తం 16,31,039 12,41,135 76.09

Advertisement
 
Advertisement
 
Advertisement