భాస్కర్‌రావు ఆస్తులు రూ.4.78 కోట్లు | Sakshi
Sakshi News home page

భాస్కర్‌రావు ఆస్తులు రూ.4.78 కోట్లు

Published Fri, Nov 10 2023 5:02 AM

-

మిర్యాలగూడ : మిర్యాలగూడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు ఆస్తులు రూ.4.78 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. వీటిలో చరాస్తులు రూ.3.45కోట్లు, స్థిరాస్తులు రూ.1.33కోట్లు ఉన్నాయి. రూ.32 లక్షల విలువైన ఫార్చునర్‌ కారు ఉన్నట్లు వెల్లడించారు. తన భార్య పేరిట చరాస్తులు రూ.1.33కోట్లు, స్థిరాస్తులు రూ.7.60 లక్షలు ఉన్నట్లు తెలిపారు. ఆమె పేరిట రూ.5.59లక్షల విలువైన ఐ10 కారు ఉందని.. అప్పులు లేవని వెల్లడించారు.

ఆస్తులు వెల్లడించిన బత్తుల లక్ష్మారెడ్డి..

కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి పేరిట చరాస్తులు రూ.19.86 కోట్లు, స్థిరాస్తులు రూ.73.64 లక్షలు, అప్పులు రూ.3.16 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య మాధవి పేరిట చరాస్తులు రూ.26.29 కోట్లు, స్థిరాస్తులు రూ.1.35 లక్షలు, అప్పులు రూ.7.62 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.

జైవీర్‌ ఆస్తి రూ.24 కోట్లు

నిడమనూరు : నాగార్జునసాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి చరాస్తులు రూ.24,16,90,840, ఆయన భార్య భవానీ అనుశ్రీ పేరున రూ.10,31,79,044 విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. స్థిరాస్తులు జైవీర్‌ పేరున రూ.33.30 లక్షలు.. ఆయన భార్య పేరున రూ.2.17 కోట్లు ఉన్నట్లు చూపించారు.

నివేదిత ఆస్తులు రూ.21కోట్లు

నిడమనూరు: సాగర్‌ బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితకు స్థిర, చరాస్తులు మొత్తం రూ.21.89 కోట్లు, అప్పులు రూ.30 లక్షలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆమె భర్త శ్రీధర్‌రెడ్డి పేరున ఆస్తులు రూ.14 కోట్లు, కూతురు పేరున రూ.43 లక్షల ఆస్తులు ఉన్నట్లు చూపించారు.

Advertisement
Advertisement