సహజ వనరులపై దృష్టి.. | Sakshi
Sakshi News home page

సహజ వనరులపై దృష్టి..

Published Sat, Apr 13 2024 1:15 AM

ట్రాక్టర్‌ ద్వారా సాసర్‌లో నీటిని నింపుతున్న సిబ్బంది  - Sakshi

నీటి కుంటలు, సోలార్‌ పంపులు, ర్యాంపు వెల్స్‌ లేని ప్రదేశాల్లో ఎత్తైన ప్రాంతంలో 1,150 సీసీ సాసర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్‌ ద్వారా నీరు నింపి వన్యప్రాణులకు అందిస్తారు. బేస్‌క్యాంపు సిబ్బంది, బీట్‌ అధికారులు నాలుగు రోజులకోసారి సాసర్లను నింపే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఐసీఐసీ ఫౌండేషన్‌ నుంచి 5 ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకులను ఉచితంగా అందజేశారు. వీటి ద్వారా కొన్ని రేంజ్‌ల పరిధిలో నీరు సరఫరా చేస్తున్నారు. గతంలో అత్యధికంగా సాసర్ల ద్వారా అందించేవారు. దీంతో ట్రాక్టర్‌ శబ్దంతో వన్యప్రాణులు భయపడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతి కొంత మేర తగ్గించి సహజ వనరులపై దృష్టిసారించారు. నిఘా ఉంచేందుకు ఒక్కో సాపర్‌ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement