ఇప్పనూనెతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఇప్పనూనెతో లాభాలు

Jun 4 2025 1:11 AM | Updated on Jun 4 2025 1:11 AM

ఇప్పన

ఇప్పనూనెతో లాభాలు

బయట కిరాణా షాపుల్లో దొరికే నూనె ప్యాకెట్ల కంటే ఇప్పగింజల ద్వారా వచ్చే నూనెతో చేసుకునే వంటలు రుచిగా ఉంటాయి. కుటుంబ సభ్యులం ఉదయమే లేచి అడవికి వెళ్లి ఇప్పకాయలు సేకరించి ఇంటికి తీసుకొస్తాం. వాటి నుంచి పప్పు తీసి గానుగ పట్టి నూనె తీస్తాం. ఈ నూనెతో కాళ్ల నొప్పులు ఉంటే కూడా మర్దన చేసుకుంటాము. ఇప్పనూనె ప్రతీ ఎండాకాలంలో తయారు చేసుకుంటాము.

– సోడి లాలు, కొడిశల గొత్తికోయగూడెం

వంటల్లో వాడొద్దు

ఇప్ప నూనెతో వంటలు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. కొందరు గిరిజనులు ఎండాకాలంలో ఇప్పగింజలు సేకరించి వాటి నుండి నూనె తీస్తారు. ఆ నూనెను పూజల్లో, ఇతరత్రా కార్యక్రమంలో వాడుకోవాలి. కాని వంటల్లో వాడటం మంచిదికాదు. గిరిజనుల్లో అవగాహన లోపం వల్ల వారు వంటలు చేసుకుంటారు. ఇప్ప నూనె కూడా ఒక్క మత్తు పదార్ధం లాంటింది.

– డాక్టర్‌ గోపాల్‌రావు, జిల్లా వైద్యాధికారి

ఇప్పనూనెతో లాభాలు 
1
1/1

ఇప్పనూనెతో లాభాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement